Prabhas And Anushka Again Screen Share In Maruti Movie - Sakshi
Sakshi News home page

Prabhas And Anushka: ప్రభాస్‌-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

Jul 29 2023 1:51 PM | Updated on Jul 30 2023 11:38 AM

Prabhas And Anushka Again Screen Share In Maruti Movie - Sakshi

ప్రభాస్‌- అనుష్క టాలీవుడ్‌ సినీ హిస్టరీలో వారిది హిట్‌ పెయిర్‌ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్‌లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా నుంచి హాలీవుడ్‌ రేంజ్‌కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్‌ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్‌ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది.

(ఇదీ చదవండి: ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’మూవీ రివ్యూ)

ప్రభాస్‌- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్‌ వైరల్‌ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్‌ మారుతి.. ప్రభాస్‌తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్‌గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం.

(ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్‌ డైరెక్టర్‌తో డేర్‌ చేస్తున్న నిహారిక )

ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్‌ సినిమా తీసేందుకు  డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్‌ స్క్రీన్‌పై వారిద్దరి ఫ్యాన్స్‌ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement