వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అనుష్క తల్లిదండ్రులు..? | Rumours Of Anushka Shetty Marriage With Cricketer Goes Viral On Social Media, Her Parents Going To Complain - Sakshi
Sakshi News home page

Anushka Marriage Rumours: వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అనుష్క తల్లిదండ్రులు.. నిజమెంత?

Published Thu, Feb 1 2024 9:44 AM

Anushka Shetty Marriage News Again Viral In Social Media - Sakshi

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని క్రియేటివ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం రూపొందించింది. అసాధ్యం అయిన వాటిని ఈ టెక్నాలజీతో సుసాధ్యం చేసి చూపించొచ్చు. ఎప్పుడో చనిపోయిన నటుడిని మళ్లీ తెరపై చూపించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కొందరు సాంకేతికత మాటున సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

డీప్‌ ఫేక్‌ టెక్నాలజీకి తాజా బాధితురాలు రష్మిక. ఆమెకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వీడియోను ఎవరో మార్ఫింగ్‌ చేశారు. చివరకు అలాంటి చెత్తపని చేసిన వారు అరెస్ట్‌ కూడా అయ్యారు. కొద్దిరోజుల క్రితం ప్రముఖ హీరోయిన్‌ అనుష్కకు కూడా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు అనుష్క- ప్రభాస్‌లకు పెళ్లి అయినట్లు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు పలు ఫోటోలను టెక్నాలజీ సాయంతో క్రియేట్‌ చేసి ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు. అవి భారీగా ట్రెండ్‌ అయ్యాయి.

కానీ అవి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సాయంతో క్రియేట్‌ చేయడంతో అవన్నీ ఫేక్‌ అని అందరూ ఈజీగా చెప్పేశారు. ఈ విషయంలో వారి ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అయ్యారు. ఇలాంటి చెత్తపనులు మరోసారి చేస్తే తాటతీస్తామని కూడా వార్నింగ్‌ ఇచ్చారు. ఈ మార్ఫింగ్‌ ఫోటోలు క్రియేట్‌ చేసిన వారిపై తాజాగా అనుష్క కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఓ స్టార్‌ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి అంటూ తాజాగా ఆమె ఫోటోలతో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అనుష్క కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ ఇవ్వలేదు. అనుష్క గురించి నెలకొకసారి ఇలాంటి తప్పుడు వార్తలు కావాలనే ఎవరో  ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అనుష్క ఫేక్‌ ఫోటోలు క్రియేట్‌ చేసి ఇబ్బంది కలిగించడం చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. వీటికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టకపోతే కుదరదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని భావించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

తన సినిమాల విషయానికొస్తే.. ఐదేళ్ల తర్వాత ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో అనుష్క వెండితెరపై కనిపించింది. అయినా టాలీవుడ్‌లో తన రేంజ్‌ ఏమాత్రం తగ్గలేదని ఆ సినిమా కలెక్షన్స్‌తో నిరూపించింది. భాగమతి పార్ట్‌-2తో ఆమె త్వరలో రానుంది.

Advertisement
 
Advertisement