
టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 5న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. అయితే తన సినిమా ప్రమోషన్లకు అనుష్క శెట్టి హాజరు కావడం లేదు. ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారమే అనుష్క ప్రమోషన్స్లో పాల్గొనటం లేదు.
అయితే ప్రమోషన్స్ దూరంగా ఉన్న అనుష్క సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఏఐతో రూపొందించిన ఈ వీడియోలో చిట్టి అనుష్క డైలాగ్తో అదరగొట్టేసింది. ఈ వీడియోను అనుష్క శెట్టి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఎల్లప్పుడూ మీ అందరి ప్రేమ, మద్దతుకు చాలా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. మా చిన్న శీలవతి క్యూట్ వర్షన్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసింది.
కాగా.. ఈ చిత్రంలో అనుష్క శీలావతి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, చైతన్యా రావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.
And time and time again you all never fail to bring a smile on my face , thank u so much for all the love and support always..and thank you for this cutest version of our little sheelavati …🫠🫠🫠🫠🥰🧿
See you in theatres from September 5th #Ghaati pic.twitter.com/2Ztf6nMU9a— Anushka Shetty (@MsAnushkaShetty) August 31, 2025