Anushka Shetty Shares Her Mother Photo On Instagram; Photo Viral - Sakshi
Sakshi News home page

Anushka Shetty: అనుష్క శెట్టి తల్లిని చూశారా? ఎంత అందంగా ఉందో..

Aug 1 2023 4:08 PM | Updated on Aug 1 2023 4:28 PM

Anushka Shetty Showed Her Mother Photo In Social Media - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులను కొత్తగా పరిచయం చేయాల్సిందేమి లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. అరుంధతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పటికీ అనుష్క అంటే అందరికి జేజమ్మ(అరుంధతిలో అనుష్క పాత్ర పేరు)గానే గుర్తుండిపోయింది. అంతలా తనదైన నటనతో ఆకట్టుకుంది అనుష్క. ఆ తర్వాత బాహుబలితో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది.

(చదవండి: 

గత కొన్నేళ్లుగా అనుష్కకు సరైన హిట్‌ పడలేదు కానీ అభిమానుల ప్రేమ మాత్రం చెక్కుచెదరలేదు. త్వరలోనే ఈ బ్యూటీ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల పరంగా అనుష్క గురించి అందరికి తెలుగు కానీ ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ ఎవరీకి పెద్దగా తెలియదు. అనుష్క కూడా ఎక్కడా తన పర్సనల్‌ విషయాలను పెద్దగా షేర్‌ చేసుకోలేదు.

కానీ తాజాగా తన తల్లి ఫోటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నిన్న(జులై 31) అనుష్క తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా తల్లి ప్రఫుల్ల శెట్టి ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే మా’ అని రాసుకొచ్చింది. అనుష్క చూడడానికి అచ్చం తల్లిలాగే ఉంది. ఇద్దరి నవ్వు కూడా ఒకేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  ఆ పోస్ట్ పై ఆమె అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement
 
Advertisement
Advertisement