Anushka Shetty Reacts To Prabhas Post About Miss Shetty Mr Polishetty Teaser - Sakshi
Sakshi News home page

Prabhas- Anushka: ఇన్‌స్టా పోస్ట్‌తో మరోసారి ప్రభాస్‌-అనుష్కల డేటింగ్‌ రూమర్స్‌ 

May 1 2023 3:43 PM | Updated on May 1 2023 4:03 PM

Anushka Shetty Reacts To Prabhas Post About Miss Shetty Mr Polishetty Teaser - Sakshi

టాలీవుడ్‌లో ప్రభాస్‌-అనుష్కల జోడీకి సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ ఉంది. ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా, ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇ‍క ఎప్పటినుంచో ప్రభాస్‌-అనుష్కలు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్‌ కూడా వినిపిస్తున్నాయి.

చదవండి: 'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ‍్మత్తలా ఉందే! 

కానీ అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్‌ అని అనుష్క, ప్రభాస్‌లో క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్‌ మాత్రం వీళ్లు రియల్‌ లైఫ్‌ కపుల్‌ అయితే బాగుండని కోరుకుంటారు. ఇక తాజాగా మరోసారి ప్రభాస్‌-అనుష్కల రిలేషన్‌షిప్‌పై సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఏమైందంటే.. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్‌ రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని ప్రభాస్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. టీజర్‌ చాలా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై అనుష్క స్పందిస్తూ.. థ్యాంక్యూ 'పప్సు' అంటూ కామెంట్‌ చేసింది. ఈ స్టోరీని స్క్రీన్‌ షాట్‌ చేసిన పలువురు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. చదవండి: వారికి ఇష్టమైనప్పుడు.. మనం ఏం చేయగలం: కంగనా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement