అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..! | Buzz: Anushka Shetty Sign Seven Movies | Sakshi
Sakshi News home page

అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌ సినిమాలో కథానాయికగా..!

Apr 25 2025 11:04 AM | Updated on Apr 26 2025 4:13 PM

Buzz: Anushka Shetty Sign Seven Movies

అనుష్క శెట్టి (Anushka Shetty).. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'సూపర్‌' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. 'విక్రమార్కుడు' మూవీతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. దీంతో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది. ఈ క్రమంలో వచ్చిన అరుంధతి ఆమెను స్టార్‌​ హీరోయిన్‌గా మార్చింది.

ఆ సినిమా కోసం లావైపోయిన అనుష్క
బిల్లా, వేదం, పంచాక్షరి, ఖలేజా, మిర్చి, బాహుబలి, భాగమతి.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. సైజ్‌ జీరో సినిమా కోసం బరువు పెరిగింది కూడా! ఆ తర్వాత పెరిగిన బరువును తగ్గించుకునేందుకు అనుష్క నానా తిప్పలు పడింది. 2023లో వచ్చిన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. రెండేళ్లుగా మళ్లీ వెండితెరపై కనిపించలేదు. 

ఏడు సినిమాలు?
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఘాటి అనే లేడీ ఓరియంటెడ్‌ ఫిలిం ఉంది. అలాగే మలయాళంలో కథనార్‌ మూవీ చేస్తోంది. ఇవి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ రెండింటిని కలుపుకుని అనుష్క చేతిలో మొత్తం ఏడు సినిమాలున్నాయంటూ ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. అనుష్క చేతిలో ఏడు సినిమాలున్నాయని.. కాకపోతే వాటి గురించి దర్శకనిర్మాతలెవరూ బయటకు చెప్పొద్దని కోరిందట! 

అందుకే సైలెన్స్‌
సినిమా రిలీజ్‌కు ముందు జరిగే ప్రమోషన్స్‌లో మాత్రమే తన పాత్ర గురించి వెల్లడించాలని.. అప్పటిదాకా ఈ విషయాలేవీ బయటకు రాకూడదని నిర్మాతలను ఆదేశించినట్లు సమాచారం. ఆమె సైన్‌ చేసిన ఏడు ప్రాజెక్టుల్లో తెలుగులో 3, తమిళంలో 2, మలయాళంలో 2 సినిమాలున్నాయని తెలుస్తోంది. అందులో ఒక మూవీలో ప్రభాస్‌ (Prabhas)తో కలిసి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!

చదవండి: లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్‌?

Advertisement
 
Advertisement
Advertisement