'రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి వస్తే..' ఆసక్తిగా టీజర్ | Allari Naresh's Ramba Oorvasi Menaka Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

Ramba Oorvasi Menaka Teaser: 'రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి వస్తే..' ఫుల్ కామెడీగా టీజర్

Aug 11 2026 4:59 PM | Updated on Aug 11 2026 5:05 PM

Allari Naresh's Ramba Oorvasi Menaka Movie Teaser Out Now

అల్లరి నరేష్‌ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్‌ కాస్మిక్‌ అన్నది ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌– హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి రంభ, ఊర్వశి, మేనక వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్‌లో సన్నివేశాలు ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీతో అల్లరి నరేశ్ తన కామెడీ ట్రాక్‌లో సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీలో నరేష్‌ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ కీలక  పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement