మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి.. తొలిరోజు పేలవమైన కలెక్షన్స్‌ | Sakshi
Sakshi News home page

Miss Shetty Mr Polishetty: జవాన్‌తో పోటీ.. మిస్‌ శెట్టి.. సినిమాకు దారుణమైన కలెక్షన్స్‌.. మరీ అంత తక్కువా?

Published Fri, Sep 8 2023 1:24 PM

Miss Shetty Mr Polishetty Day 1 Box Office Collection - Sakshi

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి తొలిసారి జంటగా నటించిన చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. కామెడీ, ఎమోషన్స్‌ కలగలిపి తీసిన ఈ సినిమా సెప్టెంబర్‌ 7న రిలీజైంది. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్‌ మాత్రం పేలవంగా వచ్చాయి. ఇండియాలో కేవలం రూ.4 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్‌ లేకపోవడం, ప్రమోషన్స్‌కు అనుష్క దూరం కావడం వల్లే వసూళ్లు ఇంత పేలవంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మౌత్‌ టాక్‌ బాగుండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్‌ నెంబర్‌ పెరిగే అవకాశం ఉంది.

మరోపక్క అదేరోజు రిలీజైన బాలీవుడ్‌ మూవీ జవాన్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల మేర వసూళ్లు రాబట్టి రికార్డుల వేటకు సిద్ధమని సమరశంఖం పూరించింది. జవాన్‌, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రాలు ఒకేరోజు రిలీజవడం నవీన్‌-అనుష్కల సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. జవాన్‌కు హిట్‌ టాక్‌ రావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. మరి జవాన్‌ పోటీని తట్టుకుని మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి బాక్సాఫీస్‌ దగ్గర నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది చూడాలి!

చదవండి: బేబి పెళ్లికొడుకు.. రియల్‌ లైఫ్‌లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్‌లు.. సూసైడ్‌ ఆలోచనలు..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement