'బేబి'లో వైష్ణవి పెళ్లి చేసుకున్న నటుడితడే! అమ్మాయి చేతిలో మోసపోయానంటూ.. | Baby Actor Krishna Mallidi Opens Up About His Breakup - Sakshi
Sakshi News home page

బేబి పెళ్లికొడుకు.. రియల్‌ లైఫ్‌లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్‌లు.. సూసైడ్‌ ఆలోచనలు..

Published Fri, Sep 8 2023 12:13 PM

Baby Actor Krishna Mallidi About Break ups - Sakshi

బేబి సినిమా.. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించిన దృశ్యకావ్యం. చెప్పుడు మాటలు విని తప్పటడుగులు వేసే అమ్మాయి.. ప్రేమించిన అమ్మాయి చేసిన మోసాన్ని తట్టుకోలేక పిచ్చోడైన ప్రియుడు.. చనువిచ్చింది కదా అని అలుసు తీసుకునే కుర్రాడు.. ఇలా ఈ ముగ్గురి కథే బేబి. ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. బేబి క్లైమాక్స్‌లో వైష్ణవి.. హీరోలిద్దరినీ కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లికొడుకు కొన్ని సెకన్లే కనిపించినప్పటికీ బాగా వైరలయిపోయాడు.

డైరెక్టర్‌ కాబోయి యాక్టర్‌
తనపై బోలెడన్ని మీమ్స్‌ కూడా వచ్చాయి. ఆ అభాగ్యుడు ఎవరా? అని అప్పట్లో అంతా తలలు బాదుకున్నారు. ఫైనల్‌గా బేబిని పెళ్లి చేసుకుందెవరో తెలిసిపోయింది. అతడి పేరు కృష్ణ మల్లిడి. తనది తూర్పు గోదావరి. ఆయన సోదరుడు వశిష్ట ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణిస్తున్నాడు. డైరెక్టర్‌ అవుదామనుకుని యాక్టరైన కృష్ణ కలర్‌ ఫోటో సహా పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు. బేబి సినిమాలోలాగే నిజజీవితంలోనూ ఓ అమ్మాయి మోసం చేసిందంటున్నాడు కృష్ణ.

ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లవుతోంది. ఓసారి కారులో వెళ్తుండగా సాయిరాజేశ్‌ ఈ కథ చెప్పాడు. హీరోయిన్‌తో పెళ్లితో షూటింగ్‌ మొదలైంది. సోషల్ మీడియాలో నాపై చాలా మీమ్స్‌ వేశారు. మొదట్లో కంగారుపడ్డాను. కానీ, ఈ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా ఉంటాయని నన్ను నేను స్ట్రాంగ్‌ చేసుకున్నాను. బేబి సినిమాలోలాగే ఓ అమ్మాయి నన్ను మోసం చేసింది. అప్పటినుంచి ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది. ఆమె నాతో పాటు మరో అబ్బాయిని ఒకేసారి డేటింగ్‌ చేసింది. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఆమెను వదిలేయాలనుకోలేదు.

నాతో పాటు మరొకరితో డేటింగ్‌..
అందరినీ వదిలేసి నేను నీ ఒక్కదాని గురించే పిచ్చోడిలా ఆలోచించాను. నా మనసంతా నువ్వే నిండిపోయావు అని చెప్పాను. ఆమె మరో అబ్బాయిని వదిలేయడానికి రెడీగా లేకపోవడంతో ఇద్దరితో ఉండమన్నాను. మూడు నెలలపాటు ఆమె నాతో, మరొకరితో ఉంది. నరకం అనుభవించాను. ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి. భార్యగా ఊహించుకున్న అమ్మాయి నీతో పాటు మరొకరితో ఉంటుందంటే ఆ బాధ భరించలేము. నా వల్ల కాలేదు, ఒకరోజు ఆమెను తిట్టేసి బ్రేకప్‌ చెప్పేశాను. అప్పుడు మా నాన్న నాకు అండగా ఉన్నాడు. ఇలా నాకు మూడు బ్రేకప్‌లు జరిగాయి' అని చెప్పుకొచ్చాడు కృష్ణ.

చదవండి: రతిక గుండెలో ఇంత బాధ మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్‌..

Advertisement
 
Advertisement