Anushka Shetty Biography And Filmography In Telugu: ‌Interesting Unknown Facts - Sakshi
Sakshi News home page

Anushka Shetty Filmography: అనుష్క పేరు ఎందుకు మార్చుకుందో తెలుసా?

Nov 7 2021 11:12 AM | Updated on Nov 7 2021 12:16 PM

Anushka Shetty Filmography And Biography In Telugu - Sakshi

అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి.. మార్కెట్ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన అవసరం లేదు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న అనుష్కకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. దానికి తోడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జేజమ్మ. ఈమె గురించి ఇప్పుడు ఆడియన్స్‌కు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కానీ ఈమె కుటుంబం గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

టాలీవుడ్‌లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. 2005లో సూపర్‌ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. 

సూపర్‌ చిత్రం తర్వాత ‘మహానంది’లో హీరో సుమంత్‌కు జోడిగా నటించింది అనుష్క. అయితే ఈ చిత్రం ద్వారా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. మాస్‌ మహారాజా , రాజమౌళి​ కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’తో అనుష్క్‌కు స్టార్‌ హీరోయిన్‌ హోదా వచ్చింది. ఇక 

2009లో వచ్చిన కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’తో అనుష్క జీవితమే మారిపోయింది. ఆ సినిమాలో యువరాణి జేజమ్మగా అనుష్క అభినయానికి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

ఇక ఆ తర్వాత ‘రుద్రమదేవి’, ‘పంచాక్ష‌రి’,‘భాగ‌మ‌తి’,‘సైజ్‌ జీరో’లాంటి సినిమాల్లో నటించిన తెగులులో మళ్లీ లేడి ఓరియెంటెండ్‌ సినిమాకు ఊపుతీసుకొచ్చింది. 

 స్టార్ డైరెక్ట‌ర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘భాగమతి’గా పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ..హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేసింది. ఈ చిత్రం పెద్ద‌గా ఆడ‌లేదు.. ఆత‌ర్వాత ఏ సినిమాకి సంత‌కం చేయ‌లేదు.

అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంట​రవ్యూలో చెప్పింది. నేను ఇంటర్‌లో అడ్మిషన్‌ అప్పుడు స్వీటీ అని రాస్తే ‘ముద్దు పేరు బావుంది. కానీ అసలు పేరు రాయి’ అన్నప్పుడు ఏదోలా అనిపించింది’ అని ఓసారి అనుష్క గుర్తు చేసుకున్నారు. 23 ఏళ్ల వయసులో సెట్‌లో ‘స్వీటీ’ అని పిలుస్తుంటే బాగోలేదన్నారట. దీంతో ఆమె తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరుకు అలవాటు పడటానికి ఏడాది పట్టిందట. కాగా నేడు (నవంబర్‌ 7) అనుష్క తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా ఆమెకు బర్త్‌డే విషేస్‌ తెలియజేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement