మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్‌.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్‌ | Kangana Ranaut slams troll bhog preparation video | Sakshi
Sakshi News home page

మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్‌.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్‌

Sep 5 2026 6:53 PM | Updated on Sep 5 2026 7:12 PM

Kangana Ranaut slams troll bhog preparation video

సినీనటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటారు. జన్మాష్టమి సందర్భంగా కంగనా ఆన్‌లైన్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. తాను మనాలీలోని తన ఇంట్లో ఉన్నానని, పండుగ సందర్భంగా ప్రత్యేక భోగ్‌ తయారు చేస్తున్నానని ఆ వీడియోలో వెల్లడించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. దీనిపై ఎక్స్‌లో ఓ వ్యక్తి స్పందిస్తూ.. కంగనా వంట చేస్తున్న పాత్ర నల్లగా ఉన్నప్పటికీ, ఆమె గ్యాస్‌ వెలిగించలేదని వ్యాఖ్యానించారు. దీనిని గమనించిన కంగనా వెంటనే ఆ వ్యక్తికి కామెంట్‌లోనే ఘాటుగా సమాధానం ఇచ్చారు.

కంగనా ఏమన్నారు?
కంగనా వంట చేస్తున్న పాత్ర అప్పటికే నల్లగా ఉన్నప్పటికీ, గ్యాస్‌ స్టవ్‌ వెలిగించడం మర్చిపోయారని ఎక్స్‌లో ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. దీనికి కంగనా స్పందిస్తూ.. “ఇది హల్వా కాదు, భోగ్‌. ఇందులో చాలా పదార్థాలను విడివిడిగా తయారు చేసి, ఈ దశలో అన్నింటినీ కలుపుతారు. ఆ తర్వాత దాన్ని సెట్‌ చేసి ముక్కలుగా కోస్తారు. తల్లిదండ్రులకు, ఈ గ్రహానికి భారంగా ఉన్న వ్యక్తుల నుంచి వంట నైపుణ్యాలను ఆశించలేం. మీరు తినడంపైనే దృష్టి పెట్టండి. వంట గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు.

 

కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌
కంగనా ఇటీవల ఏసిన వ‍్యాఖ్యలు కొంతమంది యువ హిందూ మహిళలు బాధ్యత లేకుండా స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించారు. వారిని ‘జనరేషన్‌ గట్టర్‌’ అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై యోగా గురువు స్వామి రామ్‌దేవ్‌ విమర్శలు చేశారు. ఇది ‘చెడిపోయిన మనస్తత్వానికి’ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిని కంగనా తీవ్రంగా తప్పుబట్టారు. తనపై ఉన్న ఎస్సీ కేసును గమనించాలని రామ్‌దేవ్‌కు సూచించారు.

రాఖీ సందర్భంగా వీరిద్దరి మధ్య బహిరంగ వివాదం ముగిసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో కంగనా రామ్‌దేవ్‌ విలేకరులతో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. తనతో ఉన్న వివాదాన్ని ముగించి, దాన్ని సంభాషణగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు రామ్‌దేవ్‌ అందులో చెప్పారు. రాఖీ సందర్భంగా తనకు వద్ద ఓ బహుమతి ఉందని, శుభదినాన ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెబుతానని కూడా ఆయన తెలిపారు.

కంగనా పోస్ట్‌ చేస్తూ.. “పండుగ రోజు.. తప్పులు, పొరపాట్లన్నింటినీ క్షమించేందుకు ఉద్దేశించినది. నా సోదరుడు బాబా రామ్‌దేవ్‌ జీ వివాదం కాదు, సంభాషణ ఉండాలని చెప్పడం చాలా మంచిగా అనిపించింది” అని చెప్పారు. ఆమె రామ్‌దేవ్‌ ఆప్యాయతను స్వీకరిస్తూ.. “ఈ రక్షాబంధన్‌ రోజున ఆయన పంపిన స్వీట్లు, పెద్ద సోదరుడి ప్రేమ రెండింటినీ స్వీకరిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించాలి” అని పేర్కొన్నారు.

కంగనా గతంలో కృతి సనన్‌, ఆమె వైరల్‌ అయిన ప్రకటనపై కూడా విమర్శలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. “మహిళగా ఉండటానికి ఇది అద్భుతమైన సమయం. మన అలమారాల్లో అనేక రకాల దుస్తులు ఉన్నాయి. నేటి మహిళ ప్రపంచ మహిళ. కాక్‌టెయిల్‌ డ్రెస్‌ల నుంచి లెహంగా చోళీల వరకు, జీన్స్‌ నుంచి చీరల వరకు, బికినీల నుంచి సల్వార్‌ కమీజ్‌ వరకు.. ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న ఇన్ని ఆప్షన్లలో మీ సోదరుడికి బికినీ లేదా లోదుస్తులతో రాఖీ ఎందుకు కట్టాలి? మీకు ఉన్న అన్ని స్టైలింగ్‌ ఆప్షన్లు ఏమయ్యాయి? హా హా.. ఆ ప్రకటన ఉద్దేశపూర్వకంగానే అసహజంగా కనిపిస్తోంది” అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement