‘కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు’ | BJP is NOT a BIN Telangana Senior Party Leader Muralidhar Rao | Sakshi
Sakshi News home page

‘కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు’

Sep 5 2026 6:14 PM | Updated on Sep 5 2026 6:40 PM

BJP is NOT a BIN Telangana Senior Party Leader Muralidhar Rao

హైదరాబాద్‌: ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ ఏ పార్టీలో చేరుతుంది అనే డైలమా కొనసాగుతున్న తరుణంలోనే అటు బీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీలు తమ స్వరం పెంచాయి. కొండా సురేఖ  ఏ రాజకీయ పార్టీలో చేరతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాకుండానే బీఆర్‌ఎస్‌, బీజేపీలు నేరుగానే దాడి ప్రారంభించాయి.  కొండా సురేఖను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్‌ గేట్‌ను కూడా ఆమె  తాకలేరని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా దాదాపు అదే స్వరం వినిస్తుంది. కొండా సురేఖ తమ పార్టీలోకి కూడా వద్దంటూ బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు తేల్చిచెప్పేశారు. 

కొండా సురేఖ బర్తరఫ్‌ అంశం తర్వాత బీజేపీలోకి చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నేత మురళీదర్‌రావు సంచలన ట్వీట్‌ చేశారు. BJP అంటే BIN అనుకుంటున్నారా? అంటూ ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి బహిష్కృతం అయిన నేతలను తీసుకునే రాజకీయ డంపింగ్ గ్రౌండ్‌గా బీజేపీ ఉండదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం కనిపిస్తున్న సమయంలోనే ప్రతి ఊహాగానానికి బీజేపీని లింక్ చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. 

బీజేపీని చర్చలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్‌లోని అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా? అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే లోపే బీజేపీ పేరును తెరపైకి తెచ్చి రాజకీయ నరేటివ్‌ను ముందుగానే మార్చే ప్రయత్నం జరుగుతోందా?, తెలంగాణ బీజేపీ లక్ష్యం కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలకు ఆశ్రయం కల్పించడం కాదు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు విశ్వసనీయ సొంతంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనుకుంటోంది. 

ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి, వ్యక్తిత్వం, సిద్ధాంతం, రాజకీయ విధానాల్లో కనిపించాలి. బీజేపీకి కార్యకర్తల బలం, కేడర్‌ కమిట్‌మెంట్‌ కీలకం. పార్టీని కేవలం నేతల చేరికలతో బలోపేతం చేయడం కాదు. ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యం. అందుకే “BJP = BIN” అనే రాజకీయ నరేటివ్‌ను నమ్మొద్దు. ప్రస్తుతం వస్తున్న రాజకీయ ఊహాగానాల వెనుక ఇంకేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో కూడా చూడాలి. బీజేపీ ఒక ప్రత్యామ్నాయం.. మరో పార్టీకి పేరు మార్చిన రూపం కాదు’ అని స్పష్టం చేశారు.

 

ఇవీ చదవండి: 
సురేఖ ఎపిసోడ్‌, కేబినెట్‌ విస్తరణపై మహేష్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement