‘మూడు పార్టీలు కలిసి ఉన్నా పోటీకి భయపడుతున్నాయి’ | YSRCP ready for local body pollsalliance parties are scared Amarnath | Sakshi
Sakshi News home page

‘మూడు పార్టీలు కలిసి ఉన్నా పోటీకి భయపడుతున్నాయి’

Sep 5 2026 4:11 PM | Updated on Sep 5 2026 4:17 PM

YSRCP ready for local body pollsalliance parties are scared Amarnath

చోడవరం(అనకాపల్లి జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి భయపడుతుందన్నారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నా పోటీ చేయడానికి భయపడుతున్నాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీకి దిగుతుందని స్పష్టం చేశారాయన. 

చంద్రబాబులా వైఎస్‌ జగన్‌ తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారని, ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించారన్నారు. 

ప్రజా సమస్యలు మీద వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. చోడవరం, షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు రూ. 30 కోట్లు, ఉద్యోగులకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరొక 15 రోజుల్లో బకాయిలు ఇవ్వకపోతే ఈనెల 21వ తేదీన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

ఇదీ చదవండి: 

ఇది దేవుడు చెప్పిన సత్యం: బొత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement