ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్‌లు | Ias Officers Remain Silent On AP Dsc Irregularities | Sakshi
Sakshi News home page

ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్‌లు

Sep 5 2026 1:55 PM | Updated on Sep 5 2026 2:06 PM

Ias Officers Remain Silent On AP Dsc Irregularities

సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీ అక్రమాలపై ఐఏఎస్‌లు నోరు విప్పడం లేదు. కర్నూలు అనర్హత టీచర్‌ ప్రభాకర్‌పై సమాధానం చెప్పని ఐఏఎస్‌లు.. నకిలీ క్రీడా సర్టిఫికెట్ల టీచర్లపై కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా వహిస్తున్నారు. అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విద్యాశాఖ మాజీ కార్యదర్శి కోన శశిధర్‌ నోరు విప్పడం లేదు. విద్యాశాఖ కమిషనర్‌ అన్సారియా ఎందుకు మాట్లాడటం లేదన్న సందేహాలు వ్యక్తమవుతుండగా.. కార్యదర్శి శ్యామలరావు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు.

స్పోర్ట్స్‌ కోటా నకిలీ సర్టిఫికెట్లపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ ఎందుకు నోరు విప్పడం లేదు? గతంలో అంతా సక్రమమన్న అజయ్‌ జైన్‌ ఇప్పుడెక్కడ?. శాప్‌ ఎండీ భరణికి ఇప్పుడు బాధ్యత లేదా?. అర్హతలేని స్పోర్ట్‌ కోటా టీచర్లపై ఎండీ భరణి ఎందుకు నోరు విప్పడం లేదు?. లోకేష్‌ను కాపాడటం కోసం నోరు విప్పడం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై పోస్ట్‌ చేస్తే చర్యలంటూ చంద్రబాబు సర్కార్‌ వార్నింగ్‌లు ఇస్తోంది. అడ్డంగా దొరికిపోవడంతో ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement