ఆయనకు ఇద్దరు భార్యలు.. 15ఏళ్లుగా మొదటి భార్య దూరం! | Maleshwar Rao death mystery, police begins investigation | Sakshi
Sakshi News home page

ఆయనకు ఇద్దరు భార్యలు.. 15ఏళ్లుగా మొదటి భార్య దూరం!

Sep 5 2026 1:06 PM | Updated on Sep 5 2026 1:11 PM

Maleshwar Rao death mystery, police begins investigation

విశాఖపట్నం జిల్లా: మండల కేంద్రం రావికమతానికి చెందిన నవర మలేశ్వరరావు (42) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆయన మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేసి, శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాటిని నిలిపివేశారు. మలేశ్వరరావు మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు రావడంతో మృతదేహాన్ని నర్సీపట్నం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మలేశ్వరరావుకు ఇద్దరు భార్యలు కాగా, 2009లో మొదటి భార్య మాధవితో వివాహం జరిగింది. ఆమె 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. మలేశ్వరరావు మృతిపై మొదటి భార్యకు, బంధువులకు అనుమానాలు ఉండటంతో వారు 100కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారని, దీనిపై స్పందించి దహన సంస్కారాలను నిలిపివేసి మృతదేహాన్ని నర్సీపట్నం పోస్టుమార్టానికి తరలించామని రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు. 

చదవండి: గోదావరిలో దూకిన కుటుంబం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement