సాక్షి, తాడేపల్లి: టీచర్స్ డే సందర్భంగా గురువులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన భవిష్యత్తుకు నిజమైన శిల్పులు ఉపాధ్యాయులే. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో కలలను రేకెత్తించి.. విలువలను పెంపొందిస్తూ మంచి భవిష్యత్తును నిర్మించుకునే.. ఆత్మవిశ్వాసాన్ని కల్పించేది గురువులే’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. చిన్నారులను జ్ఞానవంతులుగా, సాధికారులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ప్రతి గురువుకీ హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
On the occasion of #TeachersDay, I extend my heartfelt greetings and gratitude to all our teachers.
Teachers are the architects of our future. Beyond imparting knowledge, they inspire dreams, instil values and give our children the confidence to shape a better tomorrow.
My…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2026


