హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ రాజకీయ భవిష్యత్‌పై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డి స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించే ప్రసక్తే లేదన్నారు. కొండా సురేఖను కనీసం తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమన్నారు జగదీష్‌రెడ్డి. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దని తప్ప ఎవరినీ తీసుకోమన్నారు. ఎమ్మెల్యేల క్యారకర్ట్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటామన్నారు.
‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోము. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ బీఆర్‌ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే’ అని పేర్కొన్నారు.
కొండా సురేఖ బర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు


