‘కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నాం’ | Telangana PCC Chief Mahesh Kumar Goud reacts to Konda Surekha dismissal | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ బర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

Sep 4 2026 3:20 PM | Updated on Sep 4 2026 3:38 PM

Telangana PCC Chief Mahesh Kumar Goud reacts to Konda Surekha dismissal

సాక్షి,న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  

కొండా సురేఖ తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించి ఉండాల్సింది. అలా ఖండించకపోవడం వల్లే ఈ అంశాన్ని ఏఐసీసీ  చాలా సీరియస్‌గా తీసుకుంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము బలంగా కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం గానీ, పరిస్థితి గానీ లేదని మహేష్ గౌడ్ తేల్చిచెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement