మహబూబ్‌నగర్: కొండా సురేఖ బర్తరఫ్ అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలే కొండా సురేఖ బర్తరఫ్‌కు కారణమన్నారు. కొండా సురేఖ సీనియర్ నాయకురాలని, వైఎస్సార్ మంత్రి వర్గంలో ఇద్దరం కలిసి పని చేశామన్నారు. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖను బాధ్యరాలిని చేసి బర్తరఫ్ చేయడమనేది మంచి పరిణామం కాదన్నారు.
వికారాబాదు జిల్లా మర్పల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి రాఖీ కట్టించుకున్నాడు.. గొంతు పిసికిండు’ అని ఆమె విమర్శించారు. తనను నమ్ముకున్న మహిళలను అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చోబెట్టిన అని చెప్పిన సీఎం రేవంత్.. ఇప్పుడు మాత్రం గొంతు పిసికిండు అని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి:
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ


