breaking news
P Muralidhar Rao
-
‘కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు’
హైదరాబాద్: ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ ఏ పార్టీలో చేరుతుంది అనే డైలమా కొనసాగుతున్న తరుణంలోనే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు తమ స్వరం పెంచాయి. కొండా సురేఖ ఏ రాజకీయ పార్టీలో చేరతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాకుండానే బీఆర్ఎస్, బీజేపీలు నేరుగానే దాడి ప్రారంభించాయి. కొండా సురేఖను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్ గేట్‌ను కూడా ఆమె తాకలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా దాదాపు అదే స్వరం వినిస్తుంది. కొండా సురేఖ తమ పార్టీలోకి కూడా వద్దంటూ బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు తేల్చిచెప్పేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం తర్వాత బీజేపీలోకి చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీదర్‌రావు సంచలన ట్వీట్ చేశారు. BJP అంటే BIN అనుకుంటున్నారా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి బహిష్కృతం అయిన నేతలను తీసుకునే రాజకీయ డంపింగ్ గ్రౌండ్‌గా బీజేపీ ఉండదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం కనిపిస్తున్న సమయంలోనే ప్రతి ఊహాగానానికి బీజేపీని లింక్ చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపీని చర్చలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్‌లోని అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా? అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే లోపే బీజేపీ పేరును తెరపైకి తెచ్చి రాజకీయ నరేటివ్‌ను ముందుగానే మార్చే ప్రయత్నం జరుగుతోందా?, తెలంగాణ బీజేపీ లక్ష్యం కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలకు ఆశ్రయం కల్పించడం కాదు.కాంగ్రెస్, బీఆర్ఎస్లకు విశ్వసనీయ సొంతంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనుకుంటోంది. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి, వ్యక్తిత్వం, సిద్ధాంతం, రాజకీయ విధానాల్లో కనిపించాలి. బీజేపీకి కార్యకర్తల బలం, కేడర్ కమిట్మెంట్ కీలకం. పార్టీని కేవలం నేతల చేరికలతో బలోపేతం చేయడం కాదు. ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యం. అందుకే “BJP = BIN” అనే రాజకీయ నరేటివ్‌ను నమ్మొద్దు. ప్రస్తుతం వస్తున్న రాజకీయ ఊహాగానాల వెనుక ఇంకేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో కూడా చూడాలి. బీజేపీ ఒక ప్రత్యామ్నాయం.. మరో పార్టీకి పేరు మార్చిన రూపం కాదు’ అని స్పష్టం చేశారు.BJP is NOT a BIN.Why is the media so eager to drag BJP into every speculative political story—just when the Congress crisis appears to be unfolding?Is this an attempt to prematurely stop the game, divert the narrative, and help Congress nip its troubles in the bud?BJP…— P Muralidhar Rao (@PMuralidharRao) September 5, 2026 ఇవీ చదవండి: సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’ -
రక్షణ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు
సాక్షి, హైదరాబాద్ : పదవులు ఇప్పిస్తానని చెప్పడమే కాక కేంద్ర రక్షణ శాఖ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి.. మోసం చేసినందుకుగాను బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదయ్యింది. వివరాలు.. బీజేపీ జనరల్ సెక్రటరీ పీ మురళీధర్ రావు హైదరాబాద్‌కు చెందిన రియల్ఎస్టెట్ వ్యాపారవేత్త మహిపాల్ రెడ్డిని ఫార్మా ఎక్సిల్ చైర్మన్‌ని చేస్తానని చెప్పాడు. అందుకు గాను మహిపాల్ దగ్గర నుంచి రూ. 2.17 కోట్లను వసూలు చేశాడు అనంతరం నిర్మలా సీతారామన్ సంతకంతో ఉన్న ఓ అపాయింట్మెంట్ ఆర్డర్‌ని మహిపాల్‌కు ఇచ్చాడు. కానీ సదరు ఉత్తర్వులు నకిలీవే కాక.. మురళీధర్ రావు ఏకంగా నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. దాంతో మహిపాల్ భార్య ప్రవర్ణా రెడ్డి.. మురళీధర్ రావు మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మురళిధర్ రావుతో పాటు మరో ఎనిమింది మంది మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 406, 420, 468, 471, 506, 120-బీ కింద కేసు నమోదయ్యింది. -
ఆయన ట్రెండ్ సెట్టర్: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. దాసరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చలనచిత్ర రంగంలో ఆయన ట్రెండ్ సెట్టర్ అని, సామాజిక అంతరాలు తొలగించేవిధంగా సినిమాలు తీశారని కొనియాడారు. దాసరి నారాయణరావు నిబద్ధత కలిగిన సామాజిక రాజకీయ కార్యకర్త సోనియా గాంధీ పేర్కొన్నారు. లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు మరణం బాధాకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. ముళీధర్‌రావు అన్నారు. సామాజిక అన్యాయం, అవినీతి, లింగ వివక్ష వ్యతిరేకంగా ఆయన సినిమాలు తీశారని గుర్తుచేశారు. -
సీఎం డెరైక్షన్లోనే సమైక్య ఉద్యమం: మురళీధర్‌రావు
ఇల్లంతకుంట/బెజ్జంకి, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డెరైక్షన్లోనే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి, ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామాల్లో బుధవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రజల సమస్యల్ని విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకాలం నాన్చుడు ధోరణి అవలంభించిన కాంగ్రెస్ సర్కారు రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డ్రామాలాడుతోందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమానికి సీఎం కిరణే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు ప్రజలున్న ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విడదీయవద్దంటున్న సీఎం గల్ఫ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఎందుకు రక్షించడం లేదని ప్రశ్నించారు. యూపీఏ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని అంతవరకు తాము పోరాడుతామన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.


