తెలుగు ప్రేక్షకులు ఎలాంటి తేడా చూపించరు : విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Interesting Comments About Love Oh Love, Says Telugu Audience Welcomes Good Cinema | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రేక్షకులు ఎలాంటి తేడా చూపించరు : విశ్వక్‌ సేన్‌

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 10:46 AM

Vishwak Sen Talk About Love Oh Love

‘‘లవ్‌ ఓ లవ్‌’ యూనివర్సల్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీలా అనిపిస్తోంది. కథ, కంటెంట్‌ బాగుంటే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. అది తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా భేదం చూపరు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్‌ రంగనాథన్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలిసిందే. ‘లవ్‌ ఓ లవ్‌’ విజయం సాధించి, పావిష్‌ కూడా వారి జాబితా లో చేరాలని కోరుకుంటున్నాను’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ పేర్కొన్నారు.

 పావిష్‌ నారాయణన్, నాగ దుర్గ జంటగా మాగేశ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌ ఓ లవ్‌’. మహేందర్‌ రావు వంగపల్లి సమర్పణలో దినేష్‌ రాజ్, జి. ధనంజయన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి పిక్చర్స్‌ సంస్థ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి విశ్వక్‌సేన్, నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్‌ ప్రసాద్, డైరెక్టర్‌ జి. నాగేశ్వర రెడ్డి హాజరై, సినిమా సక్సెస్‌ అవ్వాలన్నారు. 

ధనంజయన్‌ మాట్లాడుతూ–మా సినిమాపై నమ్మకంతో సుబ్బారావుగారు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ చేయడానికి ముందుకు రావడం ఆనందాన్ని కలిగించిందనీ, మీ ప్రేమ, ఆశీర్వాదాలు మా చిత్రానికి ఉండాలనీ అన్నారు మాగేశ్‌ రాజేంద్రన్‌. ‘‘ధనంజయన్‌గారితో కలిసి చేసిన నా తొలి చిత్రం ‘లవ్‌ ఓ లవ్‌’’ అని దినేష్‌ రాజ్‌ పేర్కొన్నారు. ‘‘మా సినిమాను చూసి ఆశీర్వదించండి’’ అని పావిష్‌ నారాయణన్‌ తెలిపారు. ‘‘తెలుగు అమ్మాయి అయిన నేను తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కావడం హ్యాపీగా ఉంది’’ అని నాగ దుర్గ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement