breaking news
Love Oh Love Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న 'శ్రీనివాస మంగాపురం' రాబోతుంది. దీనితో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, సిగ్మా, 418 లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ వీకెండే బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 21 వరకు సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లిస్టులో యూట్యూబర్ నాగదుర్గ 'లవ్ ఓ లవ్', తమిళ హిట్ 'చిన్ని చిన్ని ఆశై', బాలన్ ది బాయ్, దీవాన ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు అబ్జెక్షన్ మై లార్డ్, ఆజాదీ 501, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు చూడాలనే కుతుహలాన్ని రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 27 నుంచి ఆగస్టు 02 వరకు)నెట్ఫ్లిక్స్రాత్ (బ్రెజిలియన్ సిరీస్) - జూలై 29ఫైనల్ ప్రాజెక్ట్ (మెక్సికన్ సిరీస్) - జూలై 29ద ఇదో కాలేజీ మర్డర్స్: కాలేజ్ నైట్మేర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29ద బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30గట్టకుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31 (రూమర్ డేట్)అమెజాన్ ప్రైమ్సూపర్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూలై 28ద డెవిల్స్ మౌత్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31బ్యాట్మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31హాట్స్టార్కూలిన్ ఫ్రమ్ అకౌంట్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 27చిన్ని చిన్ని ఆశై (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 28ద డెవిల్ వేర్స్ ప్రదా 2 (ఇంగ్లీష్ సినిమా) - జూలై 29హార్ట్ బీట్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 30భోజ్‌పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02ఆహాఆజాదీ 501 (తెలుగు సిరీస్) - జూలై 29దీవానా (తెలుగు సినిమా) - జూలై 31జీ5బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 (రూమర్ డేట్)సోనీ లివ్ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ నాగదుర్గ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈమె గతంలో 'కలివనం' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. గతేడాది ఇది థియేటర్లలో ఆపై ఓటీటీలోకి వచ్చింది గానీ జనాలకు దీని గురించి అస్సలు తెలీదు. అయితే ఈమె రీసెంట్గా తమిళంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ మేనల్లుడు మూవీలో చేసింది. ఇప్పుడీ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)నాగదుర్గ తమిళంలో చేసిన తొలి సినిమా 'లవ్ ఓ లవ్'. పవిష్ హీరో. ఈ నెల 10న తమిళంతో పాటు తెలుగులనూ రిలీజైంది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు.. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.'లవ్ ఓ లవ్' విషయానికొస్తే.. రఘు(పవిష్), అవంతిక(నాగదుర్గ)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అయితే ప్రేమలో పడిన తర్వాత సినిమాలు, షికార్లు, షాపింగ్ పేరుతో రఘు డబ్బులన్నీ అవంతిక అవగొట్టేస్తుంది. చివరుు క్రెడిట్ కార్డులు, అప్పులు తీసుకునేలా చేస్తుంది. కానీ కొన్నాళ్ల తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన రఘు.. అవంతిక తనకు లవ్, రఘు వద్దని ఓ బ్రేకప్ లెటర్ మీద సంతకం పెట్టాలని లేదంటే ప్రేమలో తనకు చేసినవన్నీ ఓ నాలుగు నెలలు తన స్థానంలో ఉండి తను చేసినవన్నీ చేయాలని అడుగుతాడు. దీంతో అవంతిక రఘుని చూసుకుంటానని చెబుతుంది. తర్వాత ఏమైంది? ఈ క్రమంలో అవంతిక ఎదుర్కున్న ఇబ్బందులేంటి? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజైన సినిమాల విషయానికొస్తే నాగబంధం, పురుషః లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి తదితర డబ్బింగ్ చిత్రాలు.. ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా) -
తెలుగు ప్రేక్షకులు ఎలాంటి తేడా చూపించరు : విశ్వక్ సేన్
‘‘లవ్ ఓ లవ్’ యూనివర్సల్ రొమాంటిక్ కామెడీ మూవీలా అనిపిస్తోంది. కథ, కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. అది తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా భేదం చూపరు. సూర్య, కార్తీ, ధనుష్, ప్రదీప్ రంగనాథన్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో తెలిసిందే. ‘లవ్ ఓ లవ్’ విజయం సాధించి, పావిష్ కూడా వారి జాబితా లో చేరాలని కోరుకుంటున్నాను’’ అని హీరో విశ్వక్ సేన్ పేర్కొన్నారు. పావిష్ నారాయణన్, నాగ దుర్గ జంటగా మాగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓ లవ్’. మహేందర్ రావు వంగపల్లి సమర్పణలో దినేష్ రాజ్, జి. ధనంజయన్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి పిక్చర్స్ సంస్థ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విశ్వక్సేన్, నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి హాజరై, సినిమా సక్సెస్ అవ్వాలన్నారు. ధనంజయన్ మాట్లాడుతూ–మా సినిమాపై నమ్మకంతో సుబ్బారావుగారు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి ముందుకు రావడం ఆనందాన్ని కలిగించిందనీ, మీ ప్రేమ, ఆశీర్వాదాలు మా చిత్రానికి ఉండాలనీ అన్నారు మాగేశ్ రాజేంద్రన్. ‘‘ధనంజయన్గారితో కలిసి చేసిన నా తొలి చిత్రం ‘లవ్ ఓ లవ్’’ అని దినేష్ రాజ్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాను చూసి ఆశీర్వదించండి’’ అని పావిష్ నారాయణన్ తెలిపారు. ‘‘తెలుగు అమ్మాయి అయిన నేను తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కావడం హ్యాపీగా ఉంది’’ అని నాగ దుర్గ పేర్కొన్నారు.


