'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Ene Repeat Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Ene Repeat Movie: కుర్రాళ్లు రెడీ.. విడుదల తేదీ ప్రకటన

Jun 29 2026 1:44 PM | Updated on Jun 29 2026 1:51 PM

Ene Repeat Release Date Latest Update

తెలుగులో అప్పుడప్పుడు చిన్న సినిమాలే మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో తరుణ్ భాస్కర్ తీసిన 'ఈ నగరానికి ఏమైంది' ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ‍అయితే చాన్నాళ్ల తర్వాత గతేడాది దీనికి సీక్వెల్ మొదలైంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన)

ఇకపోతే తొలి భాగంలో విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేశ్, సుశాంత్, సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడు సీక్వెల్ విషయానికొచ్చేసరికి సుశాంత్ బదులు శ్రీనాథ్ మాగంటి వచ్చి చేరాడు. తొలి పార్ట్ గోవా నేపథ్యంగా తీయగా.. ఈసారి మాత్రం థాయ్‌ల్యాండ్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. ఈ ఏడాది నవంబర్ 19న థియేటర్లలోకి మూవీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'.. ‍అయ్యప్ప సాంగ్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement