రవితేజ 'ఇరుముడి'.. ‍అయ్యప్ప సాంగ్ రిలీజ్ | Ravi Teja Irumudi Movie First Song Irumudi Kattu Released, Watch Lyrical Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Irumudi Kattu Song: అయ్యప్ప భక్తులకు పునకాలు తెప్పించే పాట

Jun 29 2026 11:20 AM | Updated on Jun 29 2026 11:43 AM

Irumudi Kattu Song From Raviteja Irumudi Movie

గత కొన్నాళ్లుగా వరస సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ అందుకోలేకపోతున్న హీరో రవితేజ.. ప్రస్తుతం 'ఇరుముడి' అనే మూవీ చేస్తున్నాడు. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో తండ్రి-కూతురు సెంటిమెంటే దీని స్టోరీ. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ కానుందని కొన్నిరోజలు క్రితమే ప్రకటించారు. ఇప్పుడు 'ఇరుముడి కట్టు' అంటూ సాగే తొలి పాటని విడుదల చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

(ఇదీ చదవండి: బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు)

'ఇరుముడి కట్టు' పాట గురించి అయ్యప్ప భక్తులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సదరు గీతం నుంచి లిరిక్స్ తీసుకున్నప్పటికీ ట్యూన్ మాత్రం చాలావరకు మార్చేశారు. 'స్వామియే అయ్యప్పో.. అయ్యప్పో స్వామియే' అనే లిరిక్స్, ట్యూన్ మాత్రం అలానే ఉంచేశారు. అయినా సరే ఈ గీతం వినడానికి బాగుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ కాగా శివ నిర్వాణ దర్శకుడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' ఓటీటీ.. కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement