బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు | Bellamkonda Sreenivas Jaya Janaki Nayaka Hindi Dubbed Version Hits Massive YouTube Milestone, Check Out Record Details Inside | Sakshi
Sakshi News home page

Bellamkonda Srinivas: ఏంటి హిందీలో బెల్లంకొండకి ఇంత క్రేజా?

Jun 29 2026 10:14 AM | Updated on Jun 29 2026 11:00 AM

Bellamkonda Srinivas Jaya Janaki Nayaka Hindi Version One Billion Views

బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ఓ హీరో. ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ రాక్షసుడు, అల్లుడు శీను తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు. అయినా సరే ప్రస్తుతం మూడు నాలుగు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న ఇతడు.. ప్రస్తుతం భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేస్తున్నాడు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే తెలుగులో ఏ హీరోకి సాధ్యం కానీ ఓ క్రేజీ రికార్డ్ సాధించాడు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: 'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి)

తెలుగులో తీసిన యాక్షన్ సినిమాల్ని పేర్లు మార్చి యూట్యూబ్‌లో హిందీలో రిలీజ్ చేస్తుంటారు. వీటికి ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హీరోలు రవితేజ, రామ్ తదితరులు గతంలో చేసిన చిత్రాలకు ఇలానే వ్యూస్ వచ్చేవి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శీను కాంబోలో వచ్చిన 'జయ జానకి నాయక' కళ్లు చెదిరే ఘనత సాధించింది.

'జయ జానకి నాయక ఖూంకర్' పేరుతో యూట్యూబ్‌లో ఉన్న హిందీ వెర్షన్ సినిమా.. ఏకంగా 1000 మిలియన్లు అంటే బిలియన్ వ్యూస్ సాధించింది. దక్షిణాది నుంచి డబ్బింగ్ అయిన చిత్రాల్లో ఇదే అత్యధికం. దీని తర్వాత కేజీఎఫ్ ఛాప్టర్ 1.. 860 మిలియన్ల వ్యూస్‌తో తర్వాతి స్థానంలో ఉంది. అయితే తెలుగులో 'జయ జానకి నాయక' సినిమా జస్ట్ యావరేజ్. కానీ హిందీలో అది కూడా యూట్యూబ్‌లో మాత్రం వేరే లెవల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

అయితే తన సినిమాల హిందీ డబ్బింగులకు యూట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ వస్తుండేసరికి.. కొన్నాళ్ల క్రితం 'ఛత్రపతి' రీమేక్‌తో బెల్లంకొండ.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఘోరంగా డిజాస్టర్ అయ్యేసరికి మళ్లీ అటువైపు చూడలేదు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement