'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి | Janhvi Kapoor Set To Make Tamil Debut With Director Sargunam New Web Series, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన జాన్వీ కపూర్

Jun 29 2026 8:32 AM | Updated on Jun 29 2026 10:42 AM

Janhvi Kapoor Tamil Entry With Web Series

సినిమా ప్రాంతీయ భాషలని దాటి చాలా కాలమైపోయింది. హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా భారతీయ చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది హిందీ యాక్టర్స్.. దక్షిణాదిలో నటించేందుకు గత కొన్నాళ్ల నుంచి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్‌ల నుంచి ప్రియాంక చోప్రా, కియారా అడ్వాణీ వరకు సౌత్‌లో నటించిన వాళ్లే. రీసెంట్ టైంలో అయితే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగులో 'దేవర', 'పెద్ది' చేసింది.

(ఇదీ చదవండి: బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?)

తెలుగు సినిమాల్లో యాక్టింగ్ కంటే తన అందచందాలతో ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. చాలామంది దర్శకనిర్మాతలు ఈమె కోసం ప్రయత్నించగా చివరకు డైరెక్టర్ సర్గుణం కోలీవుడ్‌లోకి జాన్వీని పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. కలవాణి, వాగై చుడవా తదితర మూవీస్ తీసిన ఈయన ఈ మధ్యే 'ఎగ్జామ్' వెబ్ సిరీస్ తీశారు. ఇప్పుడు మరొకటి తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులోనే జాన్వీ కపూర్ కీలక పాత్ర చేయనుందట.

ఈ వెబ్ సిరీస్‌ని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌కి చెందిన నీలం ప్రొడక్షన్స్ నిర్మించనుందట. కురత్తి అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. మరి తెలుగులో గుర్తింపు కంటే విమర్శలు ఎక్కువగా అందుకున్న జాన్వీ.. తమిళంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఇదేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement