ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఇదేనా? | Fauzi Release Date Prabhas Latest Update | Sakshi
Sakshi News home page

Fauzi Release Date: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'ఫౌజీ'?

Jun 28 2026 9:07 PM | Updated on Jun 28 2026 9:07 PM

Fauzi Release Date Prabhas Latest Update

సలార్, కల్కి 2898 చిత్రాలతో సక్సెస్ అందుకున్న ప్రభాస్‌కి 'రాజాసాబ్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ తగిలింది. అయితే దీని నుంచి త్వరగానే బయటపడ్డ ఈ హీరో.. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే వీటిలో 'స్పిరిట్' ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. 'ఫౌజీ' కూడా విడుదల తేదీని ఖరారు చేసుకుందనే టాక్ వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష?)

ఈ ఏడాదిలో ఇప్పటికే ఆరు నెలలు పూర్తి కాగా కేవలం మూడు నాలుగు మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. దీంతో బాక్సాఫీస్ ఆకలి తీర్చే సినిమాల కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ 'ఫౌజీ'పై ముందు నుంచి కాస్త బజ్ ఉంది. 'సీతారామం' తీసిన హను రాఘవపూడి దర్శకుడు కావడం, స్వాతంత్ర్యం రావడానికి ముందు జరిగే పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్ కావడం లాంటివి ఆసక్తి కలిగిస్తున్నాయి.

లెక్క ప్రకారం ఈ ఆగస్టులోనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమస్యల కారణంగా అక్టోబరు-నవంబరులో వచ్చే అవకాశముందన్నారు. కానీ తాజాగా డిసెంబరు 3ని రిలీజ్ డేట్‌గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా బయటకు చెప్పనప్పటికీ ఇదే తేదీని ఫిక్స్ చేయొచ్చని మాట్లాడుకుంటున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే సలార్, అఖండ, పుష్ప, పుష్ప 2 మూవీస్ ఇదే నెలలో వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. మరి 'ఫౌజీ' ఒకవేళ డిసెంబరులో వస్తే ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement