బుల్లిరాజు.. రోజుకు రూ.లక్ష? | Bulliraju Revanth Remuneration Details Latest | Sakshi
Sakshi News home page

Bulliraju Revanth: బుల్లిరాజు రేవంత్.. గట్టిగానే డిమాండ్!

Jun 28 2026 8:34 PM | Updated on Jun 28 2026 8:34 PM

Bulliraju Revanth Remuneration Details Latest

కొన్నిసార్లు సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ కొందరు యాక్టర్స్ వైరల్ అయిపోతుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్.. ఏ క్షణాన 'సంక్రాంతికి వస్తున్నాం' చేశాడో గానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్లే తెలుగులో వరస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇ‍ప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం)

'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ తర్వాత చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', సింగిల్ తదితర చిత్రాల్లో కనిపించిన బుల్లిరాజు.. అనిల్ రావిపూడి తీస్తున్న వెంకటేశ్-కల్యాణ్ రామ్ మూవీలోనూ అవకాశం అందుకున్నాడట. ‍ఇప్పుడీ బాలనటుడు రోజుకు రూ.లక్ష పారితోషికం అందుకుంటున్నాడట. కేవలం సినిమాలే కాదు మాల్స్ ఓపెనింగ్, టీవీ షోలు, యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. ఓ వీడియో వల్ల వైరల్ అయిన ఇతడిని చూసిన అనిల్ రావిపూడి సినిమాలోకి తీసుకున్నాడు. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది రిలీజైన తర్వాత బుల్లిరాజుగా హీరో వెంకటేశ్ కంటే ఎక్కువ వైరల్ అయిపోయాడనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement