రామ్ చరణ్ 'పెద్ది' సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. కొన్ని థియేటర్లలో మాత్రమే ఆడుతోంది. మరోవైపు ఈ మూవీ ఇదే వీకెండ్‌లో ఓటీటీలోకి రానుందనే టాక్ నడిచింది. రీసెంట్ టైంలో తెలుగు చిత్రాలకు ఫాలో అయినట్లు దీనికి కూడా నాలుగు వారాల విండోనే అనుసరించారా అని అనుకుంటున్న టైంలో మరో సంగతి బయటకొచ్చింది. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా 'పెద్ది' స్ట్రీమింగ్ కానుందట. ఇంతకీ ఏ తేదీ నుంచి రానుంది?
(ఇదీ చదవండి: బెల్లంకొండ రికార్డ్.. మరే తెలుగు హీరోకి సాధ్యం కాదు)
రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీసిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ 'పెద్ది'. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. చరణ్ యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ జాన్వీతో పాటు పలు లాజిక్ లేని సీన్ల కారణంగా బోలెడన్ని విమర్శలు ఈ చిత్రంపై వచ్చాయి. అయితేనేం రూ.400 కోట్లకుపైనే కలెక్షన్స్ సాధించింది. ఇకపోతే ఈ సినిమా.. థియేటర్లలో రిలీజైన 42 రోజుల తర్వాత అంటే జూలై 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్ కానుందట.
దక్షిణాది భాషల వరకు జూలై 16 నుంచి ఓటీటీలో రిలీజ్ కానుండదా.. హిందీ మాత్రం జూలై 30 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఇది దాదాపు కన్ఫర్మ్. కాకపోతే అధికారిక ప్రకటన వస్తే పూర్తి క్లారిటీ వస్తుంది.
ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి అబ్సెషన్, మాలీవుడ్ టైమ్స్ అనే డబ్బింగ్ చిత్రాలతో పాటు సూపర్ సుబ్బు, ఇసకపట్నం తదితర తెలుగు సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్‌గా 15కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్ పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)


