సినిమాగా ‘మీర్జాపూర్‌’.. టీజర్‌ అదిరింది! | Pankaj Tripathi And Ali Fazal Starrer Mirzapur The Movie Official Telugu Teaser Out Now, Check Out Video Inside | Sakshi
Sakshi News home page

Mirzapur The Movie: సినిమాగా ‘మీర్జాపూర్‌’.. టీజర్‌ అదిరింది!

Jun 25 2026 2:37 PM | Updated on Jun 25 2026 4:08 PM

Mirzapur The Movie Teaser Out

ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు సినిమాగా రాబోతుంది.  ‘మీర్జాపూర్‌ ది మూవీ’ పేరుతో సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్‌ తెలిపింది. సిరీస్‌ మూడు పార్ట్‌లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. టీజర్‌లోనూ వారందరిని చూపించారు. 

కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్‌తో రీఎంట్రీ ఇచ్చారు. ఇక జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్‌గా మారబోతోంది. వీరితో పాటు భోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నారు. 

పూర్వాంచల్ వీధుల నుండి రాజస్తాన్ ఎడారుల వరకు.. ఈసారి మీర్జాపూర్ సామ్రాజ్యం మరింత విస్తరించబోతోంది. రక్తం మరిగే యాక్షన్ సీన్స్, గూస్‌బంప్స్ డైలాగ్స్‌తో వెండితెర దద్దరిల్లడం ఖాయం అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు

అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement