నయనతార చూడటానికి సాప్ట్‌గా ఉంటుంది కానీ వాస్తవానికి ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్. హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లో ఉన్నాం కదా అని దానిని ఎంజాయ్ చేయకుండా ఇతర రంగాల్లోనూ విస్తరిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో రిస్క్‌తో కూడిన చిత్ర నిర్మాణ రంగంలో విజయాలను సాధిస్తున్నారు. ఆమె చాలా మందికి స్ఫూర్తి అని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ అన్నారు. నయనతార నిర్మాణ సంస్థ వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్. కవిన్ హీరో. గత నెల 28న థియేటర్లలో రిలీజైంది. చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం చైన్నెలోని ఒక హోటల్‌లో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నటి రాధిక శరత్ కుమార్.. నయన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'హాయ్' షూటింగ్‌ని అందరం చాలా ఎంజాయ్ చేస్తూ నటించాం. ఈ టైంలో నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ని చాలా మిస్ అవుతున్నాం. ఆయనతో కలిసి నటించిన చివరి చిత్రం హాయ్. దర్శకుడు విష్ణు ఎడవన్.. షూటింగ్ టైంలో సమస్యలని ఎదుర్కొన్నప్పటికీ పైకి నవ్వుతూ పనిచేశారు. అందుకు ఇప్పుడు మంచి విజయాన్ని అందుకున్నారు అని రాధిక శరత్ కుమార్ చెప్పింది.
నయనతార, రాధిక శరత్ కుమార్, సుహాసిని మణిరత్నం, ప్రభు, కె.భాగ్యరాజ్ వంటి లెజెండరీ నటీనటులతో కలిసి నటించడం మంచి అనుభవమని హీరో కవిన్ పేర్కొన్నాడు. ఇది నా తొలి విజయం, ఇందుకు కారణమయిన అందరికీ ధన్యవాదాలు అని దర్శకుడు విష్ణు ఎడవన్ చెప్పాడు.


