'నన్ను ఘోరంగా అవమానించారు'.. కోలీవుడ్ హీరో ఆవేదన | Kollywood Hero Soori Shares His Bad Experience In Movies | Sakshi
Sakshi News home page

Soori: 'ఘోరంగా అవమానించారు.. టవల్ మాత్రమే కప్పుకున్నా'

Sep 1 2026 5:35 PM | Updated on Sep 1 2026 5:47 PM

Kollywood Hero Soori Shares His Bad Experience In Movies

కోలీవుడ్‌ హీరోలు ఇప్పటికే చాలామంది తెలుగులోనూ ఫేమస్ ‍అయ్యారు. అలాంటి వారిలో సూర్య ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత విజయ్, ధనుశ్, కార్తీ, విశాల్, అజిత్‌ లాంటి స్టార్స్‌కు సైతం టాలీవుడ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ‍ప్రస్తుతం మరో కోలీవుడ్ హీరో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు. అతను మరెవరో కాదు.. మండాడి మూవీతో అలరించేందుకు వస్తోన్న సూరి. ఈ మూవీ వచ్చే శుక్రవారం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.

ప్రస్తుతం మండాడి మూవీ ప్రమోషన్లతో బిడీగా ఉన్న సూరి.. ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనను ఘోరంగా అవమానించిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని సూరి వెల్లడించారు.

సూరి మాట్లాడుతూ..'నన్ను ఒక పెద్ద హీరో మూవీ షూటింగ్ కోసం పిలిచారు. అందులో ఒక టాప్ కమెడియన్‌తో కలిసి నటించే సీన్. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పెద్ద హీరో.. దర్శకుడు కలిసి మానిటర్‌లో సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వారు నా చొక్కా విప్పేసి.. రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి ఇవ్వమని చెప్పారు. అది నా సొంత చొక్కా అయినా కూడా లాక్కొని కాస్ట్యూమ్ వెహికల్‌పైకి విసిరేశారు. ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కప్పుకుని, తీవ్ర అవమాన భారంతో నా చొక్కా కోసం అక్కడ వెతుక్కున్నా. నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురిచేసిన సంఘటన ఇదే. ఇది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన' అని పంచుకున్నారు.

కాగా.. వెన్నెలా కబడ్డికుళు సినిమాతో వెండితెరకు పరిచయమైన సూరి.. తర్వాత పలు చిత్రాల్లో హాస్య నటుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో దర్శకుడు వెట్రిమారన్‌ తీసిన 'విడుదలై'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో ఇది సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'విడుదలై 2, మామన్‌, గరుడన్‌ తదితర మూవీస్‌లో సూరి హీరోగా చేసి సక్సెస్ అందుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement