అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, సునైనా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది.
ఈ నెల 18న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించారు మేకర్స్. ‘‘మహిళల భావోద్వేగాల ప్రధానంగా రూపొందిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది.
పృధ్వీ, పాయల్ రాధాకృష్ణ


