మణిశర్మ, సాయి రాజేష్, ఫర్నాజ్, సతీష్ జై, మైత్రి శరణ్
సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గజ’. సతీష్ జై దర్శకత్వం వహించారు. చలంశెట్టి సునీల్ సమర్పణలో మైత్రి శరణ్ నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీస్ విడుదల చేయనుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘అల్లకల్లోలంగా...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించగా, రామ్ మిర్యాల పాడారు. ఈ పాట విడుదల వేడుకకి దర్శకుడు సాయి రాజేష్ అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘గజ’ టీజర్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి ’’ అన్నారు.
సతీష్ జై మాట్లాడుతూ– ‘‘గజ’లో వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశం, భావోద్వేగాలు ఉంటాయి. క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు కంట తడి పెట్టుకుంటారు’’ అన్నారు. ‘‘సతీష్ ఈ సినిమాని ఎన్నో సవాళ్లని ఎదుర్కొని చేశాడు. ‘అల్ల కల్లోలంగా’ పాట అద్భుతంగా కుదిరింది’’ అని మణిశర్మ అన్నారు. ‘‘మణిశర్మగారి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందర్నీ ఆకట్టుకుంటాయి’’ అన్నారు మైత్రి శరణ్.


