మెట్లు ఎక్కలేని స్థితిలో స్టార్ హీరో కూతురు.. ఇప్పుడేకంగా హీరోయిన్గా!
తండ్రి బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమైంది విస్మయ (Vismaya Mohanlal). మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపనుంది. తుడక్కం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై రంగప్రవేశం చేయనుంది. అయితే విస్మయ ఇప్పటికే రచన, మార్షల్ ఆర్ట్స్‌లో ఆరి తేరింది. 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్' అనే పుస్తకంతో రచయిత్రగా ప్రయాణం ప్రారంభించింది. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా అలరించనుంది.థాయ్‌ల్యాండ్‌లో ఫిట్నెస్ ట్రైనింగ్విస్మయ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. థాయ్‌ల్యాండ్‌లో ఫిట్నెస్ క్యాంప్‌నకు వెళ్లి తన శరీరంపై ఫోకస్ చేసింది. అటు మార్షల్ ఆర్ట్స్, ఇటు ప్రత్యేక వ్యాయామాలతో 22 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్లో తనే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది. ఫిట్‌గా ఉండాలనిపించేది కానీ అందుకోసం ఏదీ చేయకపోయేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది.నా వల్ల కాదనుకున్నప్పుడల్లా..కొండలు ఎక్కేస్తున్నాను. ఎక్కువసేపు స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. నాకోసం 100 శాతం కష్టపడ్డాడు. ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు. గాయాలవుతున్నా సరే.. నా ఫిట్నెస్ జర్నీ ఆపకూడదని నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా వల్ల కాదనుకున్న ప్రతిసారి.. కచ్చితంగా అవుతుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇక్కడకు వచ్చాక కేవలం బరువు తగ్గడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవారిని కలిశాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. నా జీవితమే మారిపోయిందినేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నా జీవితమే మారిపోయింది అని రాసుకొచ్చింది. అప్పటినుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జూడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూడ్ ఆంథొని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంథొనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Vismaya Mohanlal (@mayamohanlal) చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి