ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ తెలుసా?
ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ సర్వ సాధారణం అయిపోయింది. ఉన్నచోటు నుంచే మొబైల్‌లోనే కావలసిన వస్తువులను బుక్ చేసుకుంటున్నారు, ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇది చాలా సౌకర్యంగా ఉన్నప్పటికీ.. ఇందులో కూడా ప్రమాదాలు కూడా ఉన్నాయి. మనం ఆన్‌లైన్‌లో వస్తువు కొనుగోలు చేసినప్పుడు పేరు, ఫోన్ నంబర్, చిరునామా, పాస్‌వర్డ్, బ్యాంక్ లేదా చెల్లింపు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కూడా ఆన్‌లైన్‌లోకి వెళ్తుంది. కాబట్టి.. షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సరికొత్త టాటా ఏరిస్ లాంచ్
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో ఏరిస్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ సెడాన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు అక్టోబర్ 11 నుంచి మొదలవుతాయి. ఇది మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
100% ఇథనాల్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. 100 శాతం ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా వాహనం అక్టోబర్‌లో విడుదల కానుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వాహనం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించినట్లు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. అయితే, అక్టోబర్ వాణిజ్య విడుదల తేదీని టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అందుకే.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్!
బంగారం ధరల్లో ప్రస్తుతం కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఈ వారం ఇప్పటి వరకు పసిడి రేటు దాదాపు 1.7 శాతం తగ్గింది. అయితే.. శుక్రవారం మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.6 శాతం పెరిగి ఔన్సుకు 4,304.71 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 1 శాతం పెరిగి 4,340 డాలర్లకు చేరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు
డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడికీ ‘ఆధార్’ ప్రాథమిక గుర్తింపుగా మారింది. వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) స్కాన్ల ఆధారంగా డిజిటల్ సిస్టమ్ ప్రతి ఒక్కరినీ విడివిడిగా గుర్తిస్తుంది. అయితే, ప్రకృతి సృష్టించిన ఒక అరుదైన పోలిక ఆధార్‌కే సవాలుగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన 10వ తరగతి కవలలు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ల విషయంలో నమోదైన ఘటన సాంకేతిక నిపుణులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


