సరికొత్త టాటా ఏరిస్‌ వచ్చేసింది! | Tata Aeris Launched In India At Rs 5 29 Lakh | Sakshi
Sakshi News home page

సరికొత్త టాటా ఏరిస్‌ వచ్చేసింది!

Sep 25 2026 2:43 PM | Updated on Sep 25 2026 3:05 PM

Tata Aeris Launched In India At Rs 5 29 Lakh

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. మార్కెట్లో ఏరిస్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ సెడాన్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు అక్టోబర్ 11 నుంచి మొదలవుతాయి. ఇది మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

డిజైన్
టాటా ఏరిస్ ఆకట్టుకునె డిజైన్ పొందుతుంది. ముందు భాగం టియాగో వెర్షన్ నుంచి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది. అంతే కాకుండా.. సెడాన్ సైడ్ ప్రొఫైల్, రూఫ్‌లైన్‌ను వెనుక భాగంతో కలిపే వంపులతో ఒక సరికొత్త రూపాన్ని అందిస్తుంది. వెనుకవైపు సరికొత్త డిజైన్‌ను చూడవచ్చు. ముఖ్యంగా టెయిల్ ల్యాంప్స్ పూర్తిగా కొత్త డిజైన్‌లో ఉన్నాయి. టెయిల్‌గేట్‌పై ఏరిస్ అనే అక్షరాలు కూడా ఉంటాయి.

కలర్ ఆప్షన్స్
డాండెలి డ్రిజిల్, నైట్రో క్రిమ్సన్, డ్యూన్ గ్లో, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, డేటోనా గ్రే వంటి పెయింట్ స్కీమ్‌లలో లభించే ఈ కారు 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

ఇంజిన్ వివరాలు
టాటా ఏరిస్ 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 86 hp పవర్ మరియు 113 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో.. i-CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను పొందుతుంది. CNG వెర్షన్ 70-లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ట్విన్ సిలిండర్ ఉండటం వల్ల కొంత ఎక్కువ బూట్ స్పేస్‌ (419 లీటర్స్) లభిస్తుంది.

ఇంటీరియర్, ఫీచర్స్
టాటా ఏరిస్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది ప్రకాశవంతమైన లోగోతో కూడిన త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. మధ్యలో ఫ్రీ-ఫ్లోటింగ్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్‌కు సరిగ్గా కింద, కారులో కంట్రోల్ బటన్లు, రోటరీ నాబ్‌లు ఉన్నాయి.

ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం.. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హై-బీమ్ అలర్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, రోల్ ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా సెటప్, అంతర్నిర్మిత డాష్‌క్యామ్ రికార్డర్ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement