మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ లాంచ్: రూ.7.92 లక్షలు! | Maruti Suzuki Swift CNG AMT Launched in India | Sakshi
Sakshi News home page

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ లాంచ్: రూ.7.92 లక్షలు!

Sep 19 2026 3:44 PM | Updated on Sep 19 2026 4:18 PM

Maruti Suzuki Swift CNG AMT Launched in India

మారుతి సుజుకి ఒకేసారి మూడు కొత్త మోడళ్లతో సీఎన్‌జీ ఆటోమాటిక్ (CNG+AMT) విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో స్విఫ్ట్ సీఎన్‌జీ ఒకటి. దీని ధర రూ. 7.92 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతోపాటు బాలెనో, డిజైర్ కూడా ఈ విభాగంలో లాంచ్ అయ్యాయి.

స్విఫ్ట్ సీఎన్‌జీ ఆటోమాటిక్ వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ వేరియంట్లలో లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 15-అంగుళాల టైర్లు, ఫాలో-మీ-హోమ్ లైట్లు, ఎత్తు సర్దుబాటు చేసుకోగల డ్రైవర్ సీటు, ఆరు స్పీకర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వాషర్‌తో కూడిన రియర్ వైపర్, ఆటోమేటిక్ ఏసీ, రియర్ ఏసీ వెంట్లు, సర్దుబాటు చేసుకోగల రియర్-సీట్ హెడ్‌రెస్ట్‌లు, 60:40 నిష్పత్తిలో మడతపెట్టగల రెండవ వరుస సీట్లు, ఫుల్ ఎల్ఈడీ లైట్ సెటప్, రియర్ యూఎస్బీ పోర్ట్‌ల వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్లు.

స్విఫ్ట్ సీఎన్‌జీ మోడ్‌లో 1.2 లీటర్ మోటార్ ద్వారా 68.74 bhp పవర్, 101.8 Nm టార్క్ పవర్ అందిస్తుంది. అయితే పెట్రోల్ మోడ్ అవుట్‌పుట్ 81.74 bhp/112.4 Nmగా ఉంది. ఈ సెటప్‌కు 5AMT సిస్టమ్ జత చేయబడింది. ఇది 35.34km/kg మైలేజ్ అందిస్తుందని సమాచారం.

ఇదీ చదవండి: భారత్‌లోకి పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement