హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ టూ-వీలర్ అయిన హోండా 'క్యూసీ3'ని లాంచ్ చేసింది. దీని ధర రూ.1.35 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇది టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా సిరీస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
హోండా QC3 ప్రారంభంలో.. ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లంలోని ఎంపిక చేసిన హోండా రెడ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. త్వరలోనే దేశంలోని ఇతర నగరాలకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. కాగా ఈ స్కూటర్ 142 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
కొత్త హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్ కనెక్టెడ్ ఫీచర్లతో పాటు సీటు కింద 32-లీటర్ల స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ను కలిగి ఉంది. దీనిని ప్రత్యేకంగా రోజువారీ వినియోగానికి, పట్టణ ప్రయాణ అవసరాలను తీర్చడానికి కంపెనీ అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఇది మ్యాట్ ఫోటాన్ గ్రే మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, పెర్ల్ షాలో బ్లూ, పెర్ల్ సైరన్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.
QC3లో కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 5 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఈ డిస్‌ప్లే ముఖ్యమైన వాహన సమాచారాన్ని అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలలో అదనపు సౌకర్యం కోసం టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫంక్షన్‌లకు కూడా మద్దతు ఇస్తుంది.
ఇదీ చదవండి: లాయర్ జాబ్‌కు గుడ్‌బై.. కుక్కలు నడిపిస్తూ రోజుకు రూ.51 వేలు సంపాదన!


