IRDAI కొత్త రూల్స్.. బీమా కంపెనీలకు కొత్త సవాళ్లు! | Insurance Distributors Bleed As Irdai Proposes Sharp Commission Cuts | Sakshi
Sakshi News home page

IRDAI కొత్త రూల్స్.. బీమా కంపెనీలకు కొత్త సవాళ్లు!

Sep 24 2026 9:18 PM | Updated on Sep 24 2026 9:22 PM

Insurance Distributors Bleed As Irdai Proposes Sharp Commission Cuts

భారత బీమా రంగంలో ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన కొత్త మార్పులు.. మార్కెట్‌లో ఒక్కసారిగా కలకలం రేపాయి. కొత్త కమిషన్ విధానానికి సంబంధించిన ప్రతిపాదనలు బయటకు రావడంతో బీమా కంపెనీలు, బ్రోకర్లు, డిజిటల్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌ల షేర్లు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌ షేర్ సుమారు 36% పడిపోవడంతో కంపెనీ మార్కెట్ విలువలో రూ.31,000 కోట్లకు పైగా తగ్గింది. ఈ ప్రభావం హెచ్‌డీఎఫ్‌సి లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వంటి ఇతర కంపెనీలపై కూడా ప్రభావం కనిపించింది.

ఈ ఆందోళనకు ప్రధాన కారణం.. బీమా పాలసీలపై చెల్లించే కమిషన్లకు కొత్త పరిమితులు తీసుకురావాలన్న ఐఆర్‌డీఏఐ ప్రతిపాదన. ఇకపై అన్ని పాలసీలకు ఒకే విధంగా కమిషన్ ఇవ్వకుండా, పాలసీ రకం, పాలసీని విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి పడే శ్రమ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. దీనివల్ల ముఖ్యంగా కొత్త పాలసీలపై వచ్చే కమిషన్లపై ఆధారపడే పాలసీ బజార్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇక బీమా కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఎక్స్‌పెన్స్ లిమిట్‌ను రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా తగ్గించే ప్రతిపాదన ఉంది. హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్సులో రెన్యూవల్ కమీషన్ మీద నియంత్రణ,  బ్యాంకు రుణంతో పాటు బీమాను బలవంతంగా తీసుకునే విధానాలకు అడ్డుకట్ట, అలాగే కస్టమర్లను ఒక నిర్దిష్ట పాలసీ వైపు నెట్టే డార్క్ ప్యాటర్న్స్‌పై నిషేధం వంటి మార్పులు కూడా ప్రతిపాదించారు.

ఈ మార్పుల వల్ల బీమా రంగంలో వ్యాపారం చేసే సంస్థలు తమ పాత విధానాలను మార్చుకోవాల్సి వస్తుంది. కేవలం కొత్త పాలసీలు అమ్మడం, కమిషన్లు సంపాదించడం కంటే రెన్యువల్, పేమెంట్, పాలసీ సర్వీసింగ్, క్లెయిమ్ సపోర్ట్ వంటి సేవలకు భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం రావచ్చు. ఆధార్ ఈ-కేవైసీ, అకౌంట్ అగ్రిగేటర్, యూపీఐ ఆటోపే వంటి డిజిటల్ సదుపాయాలు ఈ మార్పును సులభతరం చేయగలవు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో పనిచేసే ఇన్సూరెన్స్ ఏజెంట్స్, POSPs కూడా ఈ డిజిటల్ వ్యవస్థలను ఉపయోగించి కస్టమర్లకు మెరుగైన సేవలు అందించవచ్చు.

ఇదీ చదవండి: బంగారం.. దేశ ఆర్థిక వ్యవస్థపై భారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement