హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌.. సముద్ర తీరప్రాంతాల్లో వ్యర్ధాల తొలగింపు! | HCL Foundation Undertakes Mega Coastal Cleanup Campaign | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌.. సముద్ర తీరప్రాంతాల్లో వ్యర్ధాల తొలగింపు!

Sep 24 2026 8:03 PM | Updated on Sep 24 2026 8:23 PM

HCL Foundation Undertakes Mega Coastal Cleanup Campaign

దేశంలోని పలు తీరప్రాంతాల పరిసరాలను శుభ్రపరిచే మరో దశ కార్యక్రమం పూర్తి చేసినట్టు హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆధ్వర్యంలోని కార్పొరేట్‌ సామాజిక బాధ్యతా విభాగమైన హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నిధి పుంధిర్‌ తెలిపారు.

కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని 50 తీరప్రాంతాలలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. హెచ్‌సీఎల్‌ గ్రూప్‌  50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత ఆగస్టు 11న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎం.ఎస్‌. స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్, పీపుల్స్‌ యాక్షన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ సర్వీసెస్‌ సెంటర్, స్పందన్, రీఫ్‌వాచ్‌ మెరైన్‌ కన్జర్వేషన్, ప్లాన్ఃఎర్త్, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ, ప్లాన్‌ ఫౌండేషన్ ల సహకారంతో పూర్తి చేశామని వివరించారు.

కుందపుర (కర్ణాటక), కొచ్చి (కేరళ), రామనాథపురం - తూత్తుకుడి (తమిళనాడు), ఒంగోలు (ఆంధ్రప్రదేశ్‌), దక్షిణ - ఉత్తర 24 పరగణాలు (పశ్చిమ బెంగాల్‌), పూరి (ఒడిశా) ప్రాంతాలలో శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.  ఈ కార్యక్రమాల్లో తమ ఉద్యోగులు, స్థానిక సంఘాలు  పర్యావరణ భాగస్వాములు పాల్గొన్నారని,  వీధి నాటకాలు, ఇసుక శిల్పాలు , సముద్ర వ్యర్థాల ప్రదర్శనలతో సహా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 7,000 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు  సంఘ సభ్యులను పాల్గొన్నారని.

తీరప్రాంతాల నుంచి 54,000 కేజీలకు పైగా సముద్ర వ్యర్థాలను సేకరించి, బాధ్యతాయుతంగా నిర్మూలించడం జరిగిందన్నారు. పర్యావరణ సమతుల్యత, జీవనోపాధి  సమాజ శ్రేయస్సుకు ఆరోగ్యకరమైన సముద్రాలు, పరిశుభ్రమైన తీరప్రాంతాలు అత్యంత కీలకం కాగా. మన తీరప్రాంత పర్యావరణ వ్యవస్థల పట్ల సంరక్షణ  బాధ్యతాయుతమైన సంస్కృతిని పెంపొందించడంలో సహాయపడటానికి, శాశ్వత పర్యావరణ మార్పుకు భాగస్వాములందరి నిరంతర భాగస్వామ్యం అవసరం అని అభిప్రాయపడ్డారు. హెచ్‌సిఎల్‌ ఫౌండేషన్‌  దాని భాగస్వాములు కలిసి తమ తీరప్రాంత , సముద్ర పరిరక్షణ మిషన్‌ కింద తొలి దశ నుంచి ఇప్పటివరకు 8,29,610 కిలోగ్రాములకు పైగా ఘోస్ట్‌ నెట్‌లు  సముద్ర వ్యర్థాలను తొలగించారన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement