ఇంటి అద్దె అక్షరాలా రూ.10 లక్షలు!! | Rs 10 Lakh Monthly Rent For 2-Bedroom Apartment, Indian Woman Pays In New York City | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దె అక్షరాలా రూ.10 లక్షలు!!

Sep 24 2026 4:53 PM | Updated on Sep 24 2026 5:16 PM

Rs 10 Lakh Monthly Rent For 2-Bedroom Apartment, Indian Woman Pays In New York City

అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్‌ నగరంలో ఇళ్ల అద్దెలు ఎంత ఖరీదుగా ఉంటాయో తెలియజేసే ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్‌ నగరంలోని మాన్హాటన్‌లో భారతీయ సంతతికి చెందిన కంటెంట్‌ క్రియేటర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ ఖుషీ జైన్‌ రెండు పడకగదుల అపార్ట్‌మెంట్‌కు నెలకు 10,000 డాలర్లు అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.9–10 లక్షలు. ఫైనాన్స్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌ శరణ్‌ హెగ్డే ఈ అపార్ట్‌మెంట్‌ను సందర్శించినప్పుడు ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అయితే మాన్హాటన్‌లో ఇలాంటి ఇళ్లన్నీ ఇంతే అద్దె ఉంటాయని కాదు. తనకు  కావాల్సిన సౌకర్యాలు, ఆ మేరకు అందుబాటులో ఉన్న అపార్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌ను బట్టి ఖుషీ జైన్‌ అంత అద్దె చెల్లిస్తున్నారు. 2026 సెప్టెంబర్‌ నాటి మార్కెట్‌ డేటా ప్రకారం మాన్హాటన్‌లో రెండు పడకగదుల ఇళ్ల మధ్యస్థ అద్దె సుమారు 5,900–6,200 డాలర్ల పరిధిలో ఉంది. అదే సమయంలో ప్రాంతం, భవనం, సౌకర్యాలు, ఇంటి పరిమాణం, వ్యూ వంటి అంశాల ఆధారంగా అద్దె 10,000 డాలర్లు దాటడం కూడా సాధ్యమే.

తాను ఇల్లు వెతికే సమయంలో  10,000 కంటే తక్కువకు తనకు అనుకూలమైన ఇల్లు దొరకలేదని ఖుషీ జైన్‌ చెప్పుకొచ్చారు. మాన్హాటన్‌కు బయట బ్రూక్లిన్‌, క్వీన్స్‌, లాంగ్‌ ఐలాండ్‌ సిటీ, ఆస్టోరియా వంటి ప్రాంతాల్లో తక్కువ అద్దెకు ఇళ్లు దొరికే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే అక్కడ కూడా అద్దె పూర్తిగా చౌకగా ఏమీ ఉండదని, తాను చూసిన కొన్ని ఇళ్లు 5,000–6,000 డాలర్ల అద్దె పరిధిలో ఉన్నాయని వివరించారు. ఫైనాన్స్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌ శరణ్‌ హెగ్డే షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌ మారి నెటిజెన్ల మధ్య చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement