స్టాక్ మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్, నిఫ్టీ ఇలా.. | Stock Market Closing Update Know The Sensex and Nifty Details | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..

Sep 24 2026 3:24 PM | Updated on Sep 24 2026 3:44 PM

Stock Market Closing Update Know The Sensex and Nifty Details

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,247.71 పాయింట్లు లేదా 1.67 శాతం నష్టంతో 73,580.54 వద్ద, నిఫ్టీ 383.70 పాయింట్లు లేదా 1.64 శాతం నష్టంతో 23,063.10 వద్ద నిలిచాయి.

అలైడ్ బ్లెండర్స్ & డిస్టిల్లర్స్ లిమిటెడ్, సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్, కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పీబీ ఫిన్‌టెక్ లిమిటెడ్, ఎల్&టి ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

అమెరికా బెంచ్‌మార్క్ ట్రెజరీ ఈల్డ్ పెరగడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా పెరగడంతో, గురువారం నాడు బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ - నిఫ్టీ 1.5 శాతానికి పైగా పడిపోయాయి. బ్యాంకులు, NBFC స్టాక్‌లలో అమ్మకాలు, బలహీనమైన ప్రపంచ మార్కెట్ ధోరణులతో పాటుగా, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement