బంగారం, వెండి భారీ పతనం.. పడిపోయిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున పుంజుకుని నేడు మళ్లీ పడిపోయాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు కూడా నేడు గణనీయమైన తగ్గుదలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..
సినిమాలో పంచ్ డైలాగ్‌లతో థియేటర్లను హోరెత్తించిన హీరోలు.. తెరపై తమదైన శైలిలో నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్టార్లు.. ఇప్పుడు సంపదలోనూ చర్చనీయాంశంగా మారారు. ‘బాద్‌షా’ షారుఖ్ ఖాన్ నుంచి ‘మాస్’ ఇమేజ్‌తో మెప్పించిన నాగార్జున, ‘మెగాస్టార్’ చిరంజీవి, ‘మెగా పవర్‌స్టార్’ రామ్‌చరణ్ వరకు.. వీరి సినీ ప్రయాణం కేవలం హిట్ సినిమాలు, పంచ్ డైలాగ్‌లకే పరిమితం కాలేదు. నటనతో సంపాదించిన ఆదాయాన్ని వ్యాపారాలు, పెట్టుబడులు, బ్రాండ్ భాగస్వామ్యాలుగా విస్తరించి రూ.కోట్లు గడిస్తున్నారు. హురున్ రిచ్ లిస్ట్ 2026 జాబితాలో టాప్ 10 నటుల వివరాలు కింద తెలియజేశాం. పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
బ్యాంకు రుణాలకు బీమా పాలసీలు అంటగట్టొద్దు!
భారత ఇన్సూరెన్స్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) దేశీయ బీమా రంగంలో పారదర్శకతను పెంచేందుకు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పంపిణీ నిబంధనల్లో కీలక ప్రతిపాదనలు చేసింది. పాలసీల తప్పుడు విక్రయాలను (మిస్ సెల్లింగ్) అరికట్టడం, నిర్వహణ వ్యయాలను తగ్గించడం, క్లెయిమ్‌ల ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులను తీసుకొచ్చింది. పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఆదివారం బ్యాంకులు పని చేస్తాయి
దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన మూడు రోజుల బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27న (ఆదివారం) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
నో టెన్షన్.. ఈసారి ముందుగానే జీతాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈసారి ముందుగానే జీతాలు, పెన్షన్లు అందనున్నాయి. మూడు రోజుల బ్యాంకు సమ్మె నేపథ్యంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగులు నెలాఖరున ఈ సమ్మెకు పూనుకోవడంతో వరుసగా బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా జీతాలు జమయ్యే సమయం కావడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.


