ఆదివారం బ్యాంకులు పని చేస్తాయి | PSU Banks will remain open on Sunday, September 27, 2026 | Sakshi
Sakshi News home page

ఆదివారం బ్యాంకులు పని చేస్తాయి

Sep 24 2026 5:27 AM | Updated on Sep 24 2026 5:27 AM

PSU Banks will remain open on Sunday, September 27, 2026

కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం 

బ్యాంకుల సమ్మె నేపథ్యంలో చర్యలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన మూడు రోజుల బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 27న (ఆదివారం)∙అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి ముందు సెప్టెంబర్‌ 26, 27 తేదీలు వారాంతపు సెలవు రోజులు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేయాలని బ్యాంకు యూనియన్లకు ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement