రూ.500 కోట్ల వాటా అమ్మేసిన రియల్టీ దిగ్గజం | Chandru Raheja Sells Mindspace REIT Stake Worth Rs 500 Crore | Sakshi
Sakshi News home page

రూ.500 కోట్ల వాటా అమ్మేసిన రియల్టీ దిగ్గజం

Sep 23 2026 8:54 PM | Updated on Sep 23 2026 9:09 PM

Chandru Raheja Sells Mindspace REIT Stake Worth Rs 500 Crore

న్యూఢిల్లీ: ముంబై సంస్థ మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌లో బిలియనీర్‌ చంద్రు రహేజా తాజాగా 1.49 శాతం వాటా విక్రయించారు. రియల్టీ దిగ్గజం కె.రహేజా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రు ఒక్కో యూనిట్‌ రూ. 505 సగటు ధరలో 9,00,990 యూనిట్లను అమ్మివేశారు. బీఎస్‌ఈ బల్క్‌ డీల్‌ వివరాల ప్రకారం తద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకున్నారు. కాగా.. యూనిట్ల కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.

మైండ్‌స్పేస్, కామర్‌జోన్, షాపర్స్‌స్టాప్‌ బ్రాండ్లతో దేశీయంగా వాణిజ్య రియల్టీలో కార్యకలాపాలు కలిగిన కంపెనీ.. దేశీయంగా పూర్తయిన 3.6 కోట్ల చదరపు అడుగులతోపాటు, నిర్మాణంలో ఉన్న మరో 6.6 మిలియన్‌ చదరపు అడుగులు కలిగి ఉంది. అంతేకాకుండా 3.6 మిలియన్‌ చదరపు అడుగులను భవిష్యత్‌లో అభివృద్ధి చేయనుంది.

మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(రీట్‌)గా రిజిస్టర్‌ చేసుకుంది. ముంబై, పుణే, హైదరాబాద్, చెన్నైలలో వాణిజ్య సెంటర్లను కలిగి ఉంది. రహేజా గ్రూప్‌ లిస్టెడ్‌ ఆతిథ్య రంగ కంపెనీ చాలెట్‌ హోటల్స్‌కాగా.. ముంబైలో జేడబ్ల్యూ మారియట్, హైదరాబాద్‌లో వెస్టిన్‌ హోటళ్లను నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: రూ.711 కోట్ల ఇల్లు కొంటున్న ‘ఇంటర్‌’ బిజినెస్‌మ్యాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement