షేర్లన్నీ అమ్మేసి.. పైన్‌ ల్యాబ్స్‌ నుంచి మాస్టర్‌కార్డ్‌ ఔట్‌ | Mastercard Exits Pine Labs Sells 4 97 Crore Shares Rs 934 Crore Block Deal | Sakshi
Sakshi News home page

షేర్లన్నీ అమ్మేసి.. పైన్‌ ల్యాబ్స్‌ నుంచి మాస్టర్‌కార్డ్‌ ఔట్‌

Sep 23 2026 5:25 PM | Updated on Sep 23 2026 5:58 PM

Mastercard Exits Pine Labs Sells 4 97 Crore Shares Rs 934 Crore Block Deal

న్యూఢిల్లీ: గ్లోబల్‌ పేమెంట్స్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ తాజాగా పైన్‌ ల్యాబ్స్‌ నుంచి పూర్తిగా వైదొలగింది. బీఎస్‌ఈ బ్లాక్‌ డీల్స్‌ వివరాల ప్రకారం షేరుకి రూ. 187.75 సగటు ధరలో 4.31 శాతం వాటాకు సమానమైన 4,97,24,182 షేర్లు విక్రయించింది. తద్వారా దాదాపు రూ. 934 కోట్లు అందుకుంది. అనుబంధ సంస్థ మాస్టర్‌కార్డ్‌ ఆసియా పసిఫిక్‌ పీటీఈ ద్వారా 13 డీల్స్‌ ద్వారా వాటాను అమ్మివేసింది.

కొటక్‌ మహీంద్రా, ఎడిల్‌వీజ్, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ తదితర మ్యూచువల్‌ ఫండ్స్‌తోపాటు.. ఐసీఐసీఐ ప్రు డెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఈ వాటాలను కొనుగోలు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్‌ సంస్థలు గోల్డ్‌మన్‌ శాక్స్, మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ సింగపూర్, బీఎన్‌పీ పారిబాస్‌ అర్బిట్రేజ్, సొసైటీ జనరాలి తదితరాలు సైతం పైన్‌ ల్యాబ్స్‌ షేర్లను సొంతం చేసుకున్న జాబితాలో చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement