లెన్స్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ వాటాల విక్రయం | SoftBank Sells Lenskart Stake Rs 2888 Crore | Sakshi
Sakshi News home page

లెన్స్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ వాటాల విక్రయం

Aug 25 2026 1:26 PM | Updated on Aug 25 2026 1:28 PM

SoftBank Sells Lenskart Stake Rs 2888 Crore

న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసే సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ తాజాగా లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌లో వాటాలను మరింతగా తగ్గించుకుంది. ఓపెన్‌ మార్కెట్లో 2.6 శాతం వాటాలను రూ. 2,888 కోట్లకు విక్రయించింది. జూన్‌లో 3.25 శాతం వాటాలను సాఫ్ట్‌బ్యాంక్‌ రూ. 2,873 కోట్లకు విక్రయించింది.

తాజాగా ఒక్కో షేరుకి సగటున రూ. 641.75 రేటుతో తమ అనుబంధ సంస్థ ఎస్‌వీఎఫ్‌ టూ లైట్‌బల్బ్‌ (కేమ్యాన్‌) ద్వారా మొత్తం 4.5 కోట్ల షేర్లను అమ్మేసింది. దీనితో కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌ వాటా 9.86 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement