జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా విక్రయం | gmr airports gqg partners sells stake | Sakshi
Sakshi News home page

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా విక్రయం

Jun 4 2026 3:08 PM | Updated on Jun 4 2026 3:11 PM

gmr airports gqg partners sells stake

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానాశ్రయాల ఆపరేటర్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌ 1.8 శాతం వాటాను ఫిడిలిటీ ఇంటర్నేషనల్‌కి ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా విక్రయించింది. వీటి విలువ రూ. 1,906 కోట్లు.

ఎన్‌ఎస్‌ఈలో బ్లాక్‌ డీల్‌ డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్‌నర్స్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్విటీ ఫండ్‌ సగటున ఒక్కో షేరుకి రూ. 97.75 రేటు చొప్పున 19.50 కోట్ల షేర్లను విక్రయించింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ ఫిడిలిటీ ఇంటర్నేషనల్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ వీటిని కొనుగోలు చేసింది. జీఎంఆర్‌ గత ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల్లోకి మళ్లిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement