రూ. 2,873 కోట్ల లెన్స్‌కార్ట్‌ షేర్లు అమ్మేసిన సాఫ్ట్‌బ్యాంక్‌ | SoftBank Sells 2873 CroreLenskart Shares Cuts Stake | Sakshi
Sakshi News home page

రూ. 2,873 కోట్ల లెన్స్‌కార్ట్‌ షేర్లు అమ్మేసిన సాఫ్ట్‌బ్యాంక్‌

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 11:45 AM

SoftBank Sells 2873 CroreLenskart Shares Cuts Stake

న్యూఢిల్లీ: ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ తాజాగా ఐవేర్‌ కంపెనీ లెన్స్‌కార్ట్‌లో 3.25 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 508.55 సగటు ధరలో ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 5.65 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఎన్‌ఎస్‌ఈ బ్లాక్‌ డీల్‌ వివరాల ప్రకారం వీటి విలువ రూ. 2,873 కోట్లు.  అనుబంధ సంస్థ ఎస్‌వీఎఫ్‌ 2 లైట్‌బల్బ్‌(కేమాన్‌) ద్వారా వాటా విక్రయించింది. 

ఈ విక్రయానికి ముందు లెన్స్‌కార్ట్‌లో సాఫ్ట్‌ బ్యాంక్‌ వాటా 13.13 శాతంకాగా.. ప్రస్తుతం 9.88 శాతానికి తగ్గింది. ఎంఎఫ్‌లు వైట్‌ఓక్‌ క్యాపిటల్, మిరాయ్‌ అసెట్, కొటక్, కెనరా రొబెకో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌తోపాటు.. ఇన్సూరెన్స్‌ కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్, సొసైటీ జనరాలి తదితరాలు సాఫ్ట్‌ బ్యాంక్‌ విక్రయించిన షేర్లను కొనుగోలు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement